Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్ వ్యవస్థ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందించనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు ఈ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని సంస్థ వివరించింది. మారుతీకి చెందిన సియాజ్, బాలెనో, ఎస్-క్రాస్, ఇగ్నిస్ కార్లపై ఈ డిస్కౌంట్ రేట్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ పై రూ.33 వేల వరకు తగ్గింపును మారుతీ అందిస్తోంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్, 15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ఇవ్వనున్నారు, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌గా అందనుంది. అలాగే నెక్సా డీలర్ షిప్ కింద పరిచయమైన మొదటి మోడల్ కార్ ఎస్-క్రాస్‌పై సంస్థ ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ రూపంగా అందిచనుంది.