Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లోకి సీబీఆర్-650ఆర్ ొ ధర 7.7 లక్షలు
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త స్పోర్ట్స్ బైక్ 'హోండా సీబీఆర్-650ఆర్'ను భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ. 7.70 లక్షలు (ఎక్స్ షోరూమ్ పాన్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన ఈ స్పోర్ట్స్ బైక్ 649 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ ఫోర్ సిలిండర్ సామర్థ్యం గల ఇంజిన్ సాయంతో 1200 ఆర్పీఎం వద్ద 94 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 8500 ఆర్పీఎం వద్ద 64 న్యూటన్ మీటర్ (ఎన్ఎం) టార్క్ శక్తిని అందిస్తుందని కంపెనీ వివరించింది. అయితే భారత్‌లో విడుదల చేసిన ఈ మోడల్స్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసింది. 11,500 ఆర్పీఎం వద్ద 87 బీహెచ్పీ శక్తితో 60.1 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే విధంగా ఈ మోడల్స్‌ను డిజైన్ చేసి భారత మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. గతంలో మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ హోండా సీబీఆర్-650ఎఫ్‌తో పోలిస్తే ఫుల్ హెచ్డీ లైటింగ్, డిజిటల్ ఎల్సీడీ డిస్ప్లే, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, అత్యాధునిక హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టమ్, అత్యుత్తమ స్టీరింగ్ క్వాలిటీతో ఈ మోడల్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా ఉన్న 22 హోండా వింగ్వరల్డ్ డీలర్ల వద్ద ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ' భారత మార్కెట్లో హోండా ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌ల వాణిజ్యం మరింత పుంజుకునేందుకు ఈ మోడల్ దోహద పడుతుందని ఆశిస్తున్నామని.. శక్తివంతమైన ప్రదర్శన, రేసింగ్ మోడ్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సీబీఆర్-650ఆర్ మోడల్ మిడిల్‌వెయిట్ స్పోర్ట్స్ బైక్ ఔత్సాహికులను ఎంతగానో ఆకర్షిస్తుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యద్విందర్ సింగ్ గులేరియా పేర్కొన్నారు.