Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గృహోపకరణాల తయారీదారు హయర్ భారత మార్కెట్లోకి మినీ వర్టికల్ ప్రీజర్ బిడి88డిఇఎం, ప్రీమియం వర్టికల్ ప్రీజర్ బిడి 168డబ్ల్యుఎల్ను విడుదల చేసింది. వినియోగదారుల మారిపోతున్న జీవనశైలులకు అనుగుణంగా చిన్న, పెద్ద కుటుంబాల విభిన్న అవసరాలను తీర్చడానికి వీటిని అందుబాటులోకి తెచ్చామని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు.
88 లీటర్ల సామర్థ్యం కలిగిన బిడి88డిఇఎం ధరను రూ.27,000గా, 168 లీటర్ల బిడి 168 డబ్ల్యుఎల్ ధరను రూ.19,000గా నిర్ణయించామన్నారు. ఈ రిఫ్రిజిరేటర్లు మైనస్ 4 నుంచి 25 డిగ్రీల వరకు వేడి సరళత్వాన్ని అందిస్తాయన్నారు.