Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండారు దత్తాత్రేయ వెల్లడి
-పలు సదుపాయాల కల్పన
- సిద్దమవుతున్న ముసాయిదా
న్యూఢిల్లీ : డొమెస్టిక్ హెల్పర్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఓ జాతీయ చట్టాన్ని సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం ఫుల్ టైమ్ డొమెస్టిక్ హెల్పర్ల కింద పనిచేస్తున్న వారికి నెలకు కనీసం 9వేల రూపాయలు చట్టాన్ని రూపోందిస్తోంది. వేతనంతోపాటు సోషల్ సెక్యూరిటీ కవర్ కింద సెలవులు కూడా లభిస్తాయి. అవి కూడా వేతనపు సెలవుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ కొత్త పాలసీ వల్ల డొమెస్టిక్ హెల్పర్ల వల్ల సర్వీస్ సెక్టార్లో భాగంగా గుర్తింపు లభించబోతోంది. నేషనల్ పాలసీ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ డ్రాఫ్ట్ కు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. డ్రాఫ్ట్ ప్రకారం డోమెస్టిక్ హెల్ప్ లైంగిక దాడి, బానిస కార్మిక వ్యవస్థలపై కఠినతరమైన చట్టాలు రాబోతున్నాయి. వీటితో పాటు ప్రతి ఏడాదిలో 15 రోజులపాటు కంపల్సరీ సెలవులు,మెటర్నిటి లీవ్ లభించేలా చట్టాలు రూపకల్పన చేస్తున్నారు.
ప్రత్యేక నియమ నిబంధనలు
కోత్త పాలసీలో డొమెస్టిక్ హెల్ప్ వర్కర్లకు విద్యతోపాటు, పనిలో భద్రత వంటి అంశాలలో ఫిర్యాదులనేవి లేకుండా కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జాగురూకతతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా డొమెస్టిక్ వర్కర్స్ సామాజిక భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. డైరక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ద్వారా తయారుచేసిన డ్రాఫ్ట్ నోట్లో కార్మిక మంత్రిత్వశాఖ మంత్రి దత్తాత్రేయ చోరవచూపుతున్నారు. డొమెస్టిక్ లేబర్పై లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయని, వాటిని నియం త్రించేలా కోత్త పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కేటగిరులుగా డొమెస్టిక్ వర్కర్లు
ఆన్ స్కిల్డ్, సెమిస్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరిలుగా విభజించారు. ఈ పాలసీ ప్రకారం యాజమాని, వర్కర్ల మధ్య ఓప్పందం కుదిర్చే ఏజెన్సీలు మూడు తరహాలో అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం అన్ స్కిల్డ్, సెమి స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీల వర్కర్లుగా విభజించి ప్రతినెల కనీసం వేతనం అందేలా ఈ డ్రాఫ్ట్ తయారు చేశారు.
డొమెస్టిక్ వరర్లకు సర్వీస్ సెక్టార్లో భాగం..
హైలీ స్కిల్డ్, ఫుల్ టైమ్ సర్వీస్ కింద పనిచేసే వారికి ప్రతినెల 9వేల రూపాయలు ప్రతినెలా జీతం ఇచ్చేలా చట్టం రాబోతోంది. కాగా కేంద్రం 2007లో డొమెస్టిక్్ వర్కర్లకు ప్రత్యేకంగా పాలసీ తేవాలని భావించింది. 2013,14లలో రెండుసార్లు ఈ పాలసీపై కేబినెట్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత దీనిని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీకి రిఫర్ చేశారు.