Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. యాక్సిస్ బ్యాంక్, మాస్టర్ కార్డ్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందు బాటులోకి తీసుకొ చ్చింది. ఈ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్, మింత్ర, 2 గుడ్లో కొనుగోలుపై 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. దీంతో పాటు మేక్మైట్రిప్, గోబిబో, ఉబర్, పీవీఆర్, క్యూర్‌ఫిట్, అర్బన్ క్లాప్ వంటి వెబ్సైట్లలో 4 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనుంది. ఇతర రిటైల్ కొనుగోలుపై 1.5 శాతం దాకా క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం ప్రతినెలా వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది. పెట్రోల్/డీజిల్ కొనుగోలుపై నెలకు రూ.500 వరకు సర్‌ఛార్జి రుసుము తగ్గింపు వంటి ఆఫర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు పొందేందుకు, వార్షిక రుసుము కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.