Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంక్ విధానాలను సమీక్షిస్తూనే, అభివృద్ధికి చేపట్టా ల్సిన చర్యలను గురించి మేథోమథనం జరిపేందుకు గాను యూకో బ్యాంక్ ఆదివారం (18వ తేదీన) ప్రాంతీయ బ్యాంకర్స్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి బ్యాంక్ ప్రాంతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రాంతీయ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా యూకో బ్యాంక్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్‌తో పాటు ప్రాంతీయ స్థాయిలోని బ్యాంక్‌కు చెందిన అన్ని శాఖల అధిపతులు పాల్గొననున్నట్టుగా యూకో బ్యాంక్ వెల్లడించింది.