Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిటైల్ చెయిన్ డీమార్ట్‌లను నిర్వహించే అవె న్యూ సూపర్‌మర్ట్స్ ప్రస్తుత ఆరిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 53.3 శాతం వృద్ధి తో రూ.394 కోట్ల స్టాండలోన్ లాభాలు సాధించింది. 2018-19 ఇదే క్యూ3లో రూ.257 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.5,451 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ3లో 23.90 శాతం పెరిగి రూ.6,752 కోట్లకు చేరింది. తమ అంచనాలకు అనుగుణంగానే వృద్ధి చోటు చేసుకుంటుందని అవెన్యూ సూపర్‌మర్ట్స్ సీఈఒ, ఎండి నెవిల్లె నొరొన్హా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో కొత్తగా 20 స్టోర్లను తెరిచినట్టు తెలిపారు.