Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు మార్కెట్ విలువకు చేరిక
వాషింగ్టన్ : ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ గురువారం అరుదైన ఘనతను సాధించింది. కంపెనీ మార్కెట్ మొత్తం విలువ తొలిసారి 1ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.70 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన నాలుగో అమెరికా కంపెనీగా నమోదయ్యింది. గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో టెక్నాలజీ షేర్లలో భాగంగా అల్ఫాబెట్ షేరు విలువ 0.76 శాతం పెరగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 1ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ 2018లో తొలిసారి ఈ మార్కును అందుకుంది. తర్వాత మెక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు కూడా ఈ ఘనతకు సాధించాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు మార్కెట్ క్యాప్ ట్రిలియన్ డాలర్లపైనే కొనసాగుతున్నాయి. అయితే అమెజాన్, గూగుల్ మార్కెట్ క్యాప్‌ల ప్రస్తుతం 1ట్రిలియన్ డాలర్ల దిగువున ఉన్నాయి. ప్రకటనల ఆదాయం పెరగడటం, యూట్యూబ్ ఆదాయ ఆర్జన, క్లౌడ్ కంప్యూటరింగ్, సెల్ప్ డ్రెవింగ్ కార్ల మార్కెటింగ్ విస్తతి పెరగడం తదితర కారణాలు ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్‌ను 1ట్రిలియన్ డాలర్ల వైపు నడిపించాయని మార్కెట్ నిపుణులంటున్నారు. గతేడాది డిసెంబర్లో కంపెనీ నూతన సిఇఒగా సుందర్ పిచారును ప్రకటించారు. పిచారు ప్రమోషన్‌తో గూగుల్ సహ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్లు కంపెనీ రోజువారీ వ్యవహారాల నుంచి వైదొలిగారు. ఇటీవలే అరామ్కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు ఉన్నాయి.