Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 71 రోజుల అదనపు గడువు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఖాతాదారుల కోసం 71 వ గణంతంత్ర దినోత్సవం సందర్భంగా బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును మరో 71 రోజుల పాటు పెంచింది. దీంతో ఈ ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజులకు పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రిపబ్లిక్‌డే కనుకగా కంపెనీ కొత్తగా రూ.1,999 ప్లాన్‌ను ఎంచుకునే వారికి చెల్లుబాటును మరొక 71 రోజుల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో వినియోగదారులకు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3బీజీ రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.