Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ రేట్లు 1.7 శాతం తగ్గొచ్చు: ఫిచ్
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 1.7 శాతం తగ్గించొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. తొలుత 40 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ కోత మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. కరోనా, దేశంలో నెలకొన్న మాంద్యం నేపథ్యంలో వచ్చే ఏడాదిలో వడ్డీరేటును 175 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని విశ్లేషించింది.
దీంతో ప్రస్తుతం ఉన్న రెపోరేటు 5.15 శాతం నుంచి 3.40 శాతానికి చేరొచ్చని తెలిపింది. కాగా రివర్స్ రెపోరేటు సైతం 4.75 శాతం నుంచి 3 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 4.9 శాతంగా ఉండొచ్చని.. 2020-21లో 5.4 శాతానికి పెరగొచ్చని పేర్కొంది.