Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా సంస్థలోని సీనియర్లకు మే నెల నుంచి వేతనాల్లో కోత పెడుతున్నట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యోగులకు జులై వరకు వేతనం లేని సెలవులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. గత నెలలో ప్రతిపాదిత వేతన తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత తాజా ప్రకటన చేయడం గమనార్హం. మే నుంచి వేతనాల్లో కోత అమలు చేయక తప్పడం లేదని పేర్కొంటూ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోనోజోరు దత్తా ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో పేర్కొన్నారు.