Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ని రూపొందించేందుకు బాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. అయితే రాకేశ్ శర్మగా తొలుత అమీర్‌ఖాన్ నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ బయోపిక్‌లో ఫర్హాన్ అక్తర్ నటించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ మథారు దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి 'సారే జహాసే అచ్ఛా' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.