Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న అక్కినేని అఖిల్‌కి 'ఏజెంట్' రూపంలోనూ భారీ పరాజయం ఎదురైంది. అఖిల్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు తొలి షోతోనే ప్రేక్షకుల నిరాదరణతో డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా ఫలితంపై నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ, ఈ సినిమా విషయంలో పెద్ద తప్పు చేశామంటూ బాహాటంగా తెలియజేశారు. ఇక తాజాగా హీరో అఖిల్ సైతం ఈ సినిమా ఫలితంపై సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే, దాదాపు 80కోట్ల భారీ బడ్జెట్ పెట్టి కనీసం కథ మీద ఫోకస్ చేయకుండా సినిమా తీశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇకనైనా ఉండకండి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
'ఏజెంట్' విషయంలో పూర్తి బాధ్యత మాదే. పెద్ద టాస్క్ అని తెలిసినా దాన్ని సాధించగలమనే నమ్మకంతో సినిమా చేశాం. అయితే అది ఫెయిల్ అయింది. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం కాకముందే చిత్రాన్ని ప్రారంభించి పెద్ద తప్పు చేశాం. మధ్యలో కోవిడ్ సహా పలు సమస్యలు చుట్టుముట్టాయి. సినిమా ఫలితం విషయంలో మేం ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. ఆ కాస్ట్లీ మిస్టేక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చు కున్నాం. ఈ తరహా తప్పులు పునరావృతం కాకుండా ఏం చేయాలో చూస్తాం. మా పై ఎంతో నమ్మకం పెట్టుకున్న వారికి క్షమాపణలు. తదుపరి ప్రాజెక్టులతో ఆ లోటుని భర్తీ చేస్తామని
ప్రేక్షకులకు మాట ఇస్తున్నాం.
- నిర్మాత అనిల్ సుంకర
'ఏజెంట్' చిత్ర బృందానికి, ఆ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేం అనుకున్న దాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ఆ విధంగా మంచి చిత్రాన్ని అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమవల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత దృఢంగా సిద్ధమై మళ్ళీ వస్తాను
- అఖిల్