Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఛూ మంతర్' అంటూ మంత్రగాడు మంత్రం వేసి మాయ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. ఇలా మాయ చేయటానికి అద్వితీయ మూవీస్ పతాకంపై బి.కల్యాణ్ కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ వెంకట్ కిరణ్ కుమార్ కాళ్లకూరి నిర్మాతగా 'ఛూ మంతర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ లక్కరాజు, యశ శ్రీ జంటగా నటిస్తోన్న ఈ సినిమాని ఫిలింనగర్‌లోని కాఫీషాపులో లాంఛనంగా మేకర్స్ ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి 'ఎబిసిడి' చిత్ర దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, నిర్మాత కిరణ్ తల్లి శ్రీలక్ష్మీ కెమెరా స్విచ్చాన్ చేశారు. 'ఉరి' చిత్ర దర్శకుడు శ్రీనివాస్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'తొలిషెడ్యూల్ రెగ్యులర్ చిత్రీకరణ ఈ రోజునుండి స్టార్ట్ చేస్తాం. ఇదే బ్యానర్లో నిర్మించిన 'గ్రే' సినిమా ఈనెల 26న రిలీజ్ చేస్తున్నాం. రెండవ సినిమాగా 'హాష్టాగ్ కష్ణారామ' చిత్రాన్ని, ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న 'ఛూ మంతర్'ని మా బ్యానర్లో మూడో సినిమాగా నిర్మిస్తున్నాం' అని చెప్పారు.