Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 'టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ - సౌత్ ఇండియా 2023' వేడుకలు ఆగస్టు 12న దుబారులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఘనంగా నిర్వహించబోతున్నారు. దీని కోసం 13 మంది జ్యూరీ సభ్యులను ఎంపిక చేసుకున్న సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టియఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ,'2021-22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో అప్లరు చేసుకోవచ్చు. దీని చివరి తేదీ జూన్ 15. ఆగస్టు 12న దుబారు ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం. మూరళీ మోహన్, సుమన్, ప్రసన్న కుమార్, యస్.వి. కష్ణారెడ్డి, రోజా రమణి, శివాజీరాజా, బి.గోపాల్, విజయేంద్ర ప్రసాద్, మాదాల రవి, మిట్టపల్లి సురేంద్ర, రేలంగి నరసింహారావు, ఎం.వి.రాధాకష్ణ, సెంథిల్, జర్నలిస్ట్ ప్రభు, శేఖర్ మాస్టర్ తదితరులు నంది అవార్డు జ్యూరీ కమిటీ సభ్యులు. వీరు సెలెక్ట్ చేసిన వారికి ఈ వేడుకల్లో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్, కాపర్ అవార్డ్స్ ఇస్తారు. ఎన్టీఆర్ స్మారక అవార్డు, ఎఎన్ఆర్ స్మారక అవార్డు, సూపర్ స్టార్ కష్ణ స్మారక అవార్డు, రెబల్ స్టార్ కష్ణం రాజు స్మారక అవార్డు, అల్లు రామలింగయ్య స్మారక అవార్డు, దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక అవార్డు, కాంతారావు స్మారక అవార్డులతోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక అవార్డులను బహూకరించనున్నారు' అని చెప్పారు.