Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు(ఆదివారం) మదర్స్ డే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 'అమ్మే దైవం' పేరుతో సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మదర్స్ డే సందర్భంగా 'మిథునం' మ్యూజిక్ డైరెక్టర్ వీణపాణి ఒక పాట రాశారు. ఆ పాటతో పాటూ మన హీరోలందరి తల్లుల ఫొటోలను వేసి ఒక చిన్న వీడియో రూపంలో దాన్ని విడుదల చేస్తున్నాం. రత్నాల్లాంటి బిడ్డలను కళామతల్లికి అందించిన ఆ రత్న గర్భాల గురించి కూడా జనాలకు తెలియజేయడం ఆనందంగా ఉంది. అలాగే నేను ఇండిస్టీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అయితే వ్యాపారం, రాజకీయాలతో సినిమాలకు పదేళ్ళు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా వదిలేసి కంప్లీట్‌గా సినిమాలపై ఫోకస్ చేస్తాను' అని తెలిపారు.