Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో రానా, మిహీకా బజాజ్‌ల వివాహ మహౌత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెళ్ళి వేదిక దగ్గర అన్ని రకాల కోవిడ్ రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇరుకుటుంబ సభ్యులు, ఆత్మీయులు, నడుమ పెద్దలు నిశ్చయించిన ముహూర్తంలో తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ని రానా పెళ్ళి చేసుకున్నారు.
'శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని బాలీవుడ్ స్టార్ అక్షరు కుమార్‌తోపాటు వీరిద్దరి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదకగా విషెస్ తెలిపారు.