Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు బర్త్‌డేకి ఆయన అభిమానులు బిగ్గెస్ట్ వరల్డ్ రికార్డ్ రూపంలో అరుదైన బహుమతిని కానుకగా ఇచ్చారు. ఆదివారం మహేష్‌బాబు పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని హ్యాష్‌ట్యాగ్ హెచ్‌బిడి మహేష్‌బాబు పేరుతో మహేష్ అభిమానులు ఏకంగా 60.2 మిలియన్ల ట్వీట్లు చేసి సోషల్ మీడియాలో దుమ్మురేపారు. ఇంతవరకు ఏ కథానాయకుడికి రానన్ని ట్వీట్లు మహేష్‌బాబుకి రావడంతో దీన్నొక వరల్డ్ రికార్డ్‌గా ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మహేష్‌బాబు పుట్టినరోజు కానుకగా ఆయన తాజాగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్క కూడా సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన రావడంతో మహేష్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఇక మహేష్ పుట్టినరోజుని పురస్కరించుకుని చిరంజీవి, ఎన్టీఆర్ చెప్పిన బర్త్‌డే విషెస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. తన బర్త్‌డేకి అరుదైన గిఫ్ట్‌ని అందించిన అభిమానులకు, శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు మహేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.