Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీజిత్ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'చెరసాల'. ఎస్ రారు క్రియేషన్స్ పతాకంపై మాదినేని సురేష్ - సుధారారు గుణ్ణం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రాం ప్రకాష్ దర్శకుడు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని 'చెరసాల' చిత్ర యూనిట్ మొక్కలు నాటింది.ఈ సినిమా గురించి దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాం ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ, 'లవ్ , కామెడీ , ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి కొంత హర్రర్ ఎలిమెంట్ కూడా మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండియా క్వీన్ - 2018 కేరళ విన్నర్‌గా నిలిచిన శిల్పాదాస్ని ఒక హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం. అలాగే మరొక హీరోయిన్గా నిష్కల నటిస్తోంది. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది. మా చిత్ర మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించడం, అలాగే దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాకు బెస్ట్ విషెష్ అందిస్తూ టైటిల్ లోగోని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది' అని తెలిపారు.
' దర్శకుడు రాం ప్రకాష్ చెప్పిన కథ నచ్చడంతో మరో మాట లేకుండా సినిమాని నిర్మిస్తున్నాం. రష్ చూశాక దర్శకుడు చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్నట్లుగానే మా సినిమాని పూర్తి చేసాం. మొదటి ప్రాజెక్ట్‌తోనే తప్పకుండా మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది' అని నిర్మాత మాదినేని సురేష్ చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం : శంకర్ తిమిరి, ఎడిటింగ్ : భాను నాగ్.