Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు ప్రస్తుతం జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ బాగా వినిపిస్తోంది. తాజాగా ఆమె హెచ్బిఓ మాక్స్‌కి సంబంధించిన 'ఏ వరల్డ్ ఆఫ్ కామ్' సిరీస్‌కి ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్ తో కలిసి నెరేటర్ గా పని చేశారు. ధ్యానానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు, విశేషాలు, ప్రత్యేకతలు, దీని చరిత్ర వంటి తదితర అంశాలను ప్రియాంక, కేట్ ప్రేక్షకులకు నెరేట్ చేయబోతున్నారని హెచ్బిఓ మాక్స్ ప్రతినిధులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. 10 ఎపిసోడ్స్‌తో ఉండే ఈ సిరీస్‌ను అక్టోబర్ 1 నుంచి ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా పేర్కొన్నారు. ఈ సిరీస్‌కి ప్రియాంక, కేట్తోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ పని చేయటం విశేషం. ప్రియాంక దీంతోపాటు ప్రస్తుతం 'ది వైట్ టైగర్', 'వి కెన్ బి హీరోస్', థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్', 'మాట్రిక్స్ 3' సిరీస్, 'మా ఆనంద్ షీలా', కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో రూపొందబోయే 'తులియా' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబ్బెల్ పిక్చర్స్ పతాకంపై దాదాపు అరడజనుకి పైగా ప్రాంతీయ చిత్రాలను నిర్మిస్తోంది.