Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'బ్యూటీ గర్ల్'. లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తున్న చిత్రమిది. కోవిడ్-19కి సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ,' షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. వేము దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా వస్తోంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌కి సంబంధించి అన్ని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. ప్రేక్ష్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర మహావీర్, కెమెరా: మురళీ కష్ణ. వై, నిర్మాత: దేవదాస్ నారాయణ, దర్శకత్వం: వేముగంటి.