Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అనుష్క ప్రధాన పాత్రధారిణిగా నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై నిర్మితమవుతున్న చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- మొదట్లో చాలా చిన్న ప్రాజెక్ట్‌గానే ప్లాన్ చేద్దామనుకుని ప్రీ-ప్రొడక్షన్ పనిని స్టార్ట్ చేశా. ఓసారి కోనా వెంకట్ గారిని కలిసి లైన్ వినిపించాను. ఆయన విని, ఈ చిత్రాన్ని స్టార్ క్యాస్ట్‌తో ప్లాన్ చేద్దామని చెప్పారు. అంతేకాదు అనుష్కని తీసుకోవడంలోనూ పూర్తి క్రెడిట్ కోనాగారికే చెందుతుంది. ఆమె పేరును ఆయనే సజెస్ట్ చేసి, ఆమెకు స్క్రిప్ట్ వినిపించేలా చేసారు.
- స్క్రిప్ట్ విని చాలా బాగుందని అనుష్క గ్రీన్‌సిగల్ ఇవ్వడంతో ఈ సినిమా మేం ఊహించినదాని కంటే పెద్ద ప్రాజెక్ట్ అయ్యింది. అనుష్కది చాలా మంచి వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరిని మంచి మనసుతో సమానంగా చూస్తారు. ఇక ఆమె డెడికేషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి మాత్రమే కాదు నాకు, నా టీమ్‌కి ఆమే లైఫ్.సాక్షి అనే మూగ అమ్మాయిగా అనుష్క నటన అత్యద్భుతం. నేను ఏమైతే అనుకున్నానో దానికి వెయ్యి రెట్లతో అనుష్క ఆ పాత్రను ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలోని ఆమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు.
- అనుష్క తర్వాత ఈ కథకి మెయిన్ పిల్లర్ల్స్ మాధవన్, అంజలి, షాలిని. వీళ్ళ పాత్రలు సైతం ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఈ కథ అనుకున్నప్పుడే కచ్చితంగా హాలీవుడ్ నటుడు ఉండాలని అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే మైఖేల్ మాడ్సన్ని ఎంపిక చేసుకున్నాం.
- ఈ సినిమాలో నటీనటుల పెర్ఫామెన్స్లతో పాటు సౌండ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ విషయంలో షానియల్, డియోకు మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను.
- నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పరంగానే కాకుండా మేకింగ్ పరంగా కూడా నిర్మాతలు కోనా వెంకట్, విశ్వప్రసాద్ ఇద్దరూ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అమెరికా లాంటి కంట్రీలో 55 రోజుల చిత్రీకరణతో ఇలాంటి సినిమాని చేయడానికి నిర్మాతల రాజీపడని తనమే కారణం.
- ఫైనల్ అవుట్ ఫుట్ చూసి నేనొక్కడినే కాదు మా చిత్ర యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ వారు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ తీసుకున్న తర్వాత కొంత మంది అమెజాన్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి అభినందించారు. ఇదే మా ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాం. ప్రస్తుతానికి నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. 'నిశ్శబ్దం' విడులయ్యాకే వాటి గురించి ఆలోచిస్తాను.