Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సమయంలో దాతృత్వం చాటుకుని రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేశారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపేందుకు కృషి చేశారు. అలాగే తన తల్లి స్వర్గీయ సరోజ్‌సూద్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచిన సోనూసూద్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ సత్కరించారు. కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో ఆదుకున్న సోనూసూద్‌ను ప్రకాష్‌రాజ్‌తో పాటు 'అల్లుడు అదుర్స్' చిత్ర బృందం అభినందించింది.