Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌కు క్రికెట్ చరిత్రలో మంచి స్థానం ఉంది. ఆయన జీవితం ఆధారంగా '800' పేరుతో ఓ బయోపిక్‌ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ముత్తయ్య మురళీధరన్ గా తమిళనటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక వాసి కావడం, తమిళలను శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోయడం, దారుణమైన వివక్ష చూపటం. ఈ కారణాలతో తమిళనటుడు విజయ్ సేతుపతి '800' బయోపిక్‌లో నటించ వద్దని తమిళులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి నీకు సిగ్గులేదా అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో తమిళులకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా మద్దతు పలికారు. అయితే ఇందుకు విరుద్ధంగా అగ్ర నటి రాధిక స్పందించడంతో ఇప్పుడు ఇదొక పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
'మురళీధరన్ బయోపిక్‌లో నటించ వద్దని విజయ్ సేతుపతికి చెబుతున్నారు. వీళ్లకి ఇంకేం పని లేదా? తమిళ రాజకీయాలతో సంబంధం కలిగిన వ్యక్తికి చెందిన సన్‌రైజర్స్ టీమ్ కు మురళీధరన్ బౌలింగ్ కోచ్ గా ఎందుకు ఉన్నాడు?, విజయ్ సేతుపతి ఒక నటుడు. అతడిని వివాదాల్లోకి లాగకండి. సన్‌రైజర్స్, సన్ నెట్వర్క్ యాజమాన్యాలకు రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా రాజకీయాలను, క్రీడలను, ఎంటర్టైన్మెంట్ ను వాళ్లు విడివిడిగానే చూస్తున్నారు. మన సినీ పరిశ్రమ మాత్రం సినిమాలను, రాజకీయాలను ఎందుకు వేరుగా చూడడం లేదు?. నా ఈ స్పందనలో ఎలాంటి వివాదమూ లేదు. సినిమా ఇండిస్టీకి, దానితో సంబంధం ఉన్న నటులకు మద్దతుగా నిలిచేందుకే ట్వీట్ చేశాను. తటస్థంగా, నిబద్ధతో వ్యవహరిస్తున్నందుకే సన్‌రైజర్స్ ను ఉదాహరణగా తీసుకున్నాను' అని రాధిక వివరణ ఇచ్చారు.