Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'బ్లాక్డ్'. థ్యాంక్యూ ఇన్ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో రామారావు లెంక, పద్మ లెంక కలసి నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టైటిల్ లోగోని శనివారం చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ లొడగల మాట్లాడుతూ, ''మా మూవీ ఫస్ట్‌లుక్ టైటిల్ లోగోని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హారర్ కామెడీ జోనర్లో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకి సిద్ధంగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకారంతో మూవీ అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. అలాగే మా నిర్మాత పద్మలెంక ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రిచ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడానికి సహకరించారు. ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. అన్ని పాటలు తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. 'ఇప్పటివరకు ఎన్నో రొమాంటిక్ థ్రిల్లర్స్ వచ్చాయి. వాటికి భిన్నంగా మా సినిమా ఉంటుంది' అని నిర్మాతలు తెలిపారు.
మనోజ్ నందం, శ్వేత సాలూరు, శేకింగ్ శేషు, బాబారు, , సత్య శ్రీ, మెహబూబ్ భాష, వినరు మహదేవ్, రామారావు లెంక, శ్రీనివాసరాజు, గుండు మురళి, అర్జున్, దియారాజ్, సఖీప్రియ, శ్రీవల్లి సాలూరు, లక్ష్మన్ సాలూరు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: వెంకటేష్. కె, సంగీతం: ప్రదీప్ చంద్ర, ఎడిటర్: సోమేష్ మూత, ఆర్ట్: ఈశ్వర్, విఎఫ్ఎక్స్: జీవన్ జీఆర్, సింగర్స్: సాయి చరణ్, స్పూర్తి జితేందర్, నిర్మాతలు : పద్మ లెంక, రామారావు లెంక, దర్శకత్వం: రామ్ లొడగల.