Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా ఆపన్నులను ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ఎప్పుడూ ముందుంటూనే ఉంది. అందులో భాగంగానే తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి పెద్ద మనసుని చాటుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. చాలా మంది ఇళ్ళు కూలిపోయాయి. చాలా మందికి గాయాలయ్యాయి. చాలా మంది తమ వాళ్ళని కోల్పోయారు. చాలా మంది అన్ని కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వర్ష భీభత్సాన్ని తలపించే హదయ విదారక సంఘటనలు..
ఇలాంటి సమయంలో ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ మరోమారు నడుంబిగించింది. నేను సైతం.. అంటూ సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు తమ తమ స్థాయిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. అలాగే తమలాగే ప్రతి ఒక్కరూ స్పందించి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను కాపాడాలని సోషల్ మీడియా వేదికగా అందరినీ అభ్యర్థిస్తున్నారు. మహేష్ కోనేరు (ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్) - 1000 కేజీల బియ్యం, 500 దుప్పట్లని స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నారు. అలాగే మంచు లక్ష్మి కూడా తన బృందంతో బాధితులకు అవసరమైన వస్తువులను అందజేశారు.
గడిచిన వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతోపాటు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్ళని చేయమని కోరుతున్నాను. - చిరంజీవి
ఈ విపత్తు వల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తమ వంతు కషి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి అభినందనలు. నా వంతు సాయంగా తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
- మహేష్‌బాబు
చిరంజీవి - కోటి రూపాయలు
ప్రభాస్ - కోటి రూపాయలు
మహేష్ బాబు - కోటి రూపాయలు
నాగార్జున - 50 లక్షలు
ఎన్టీఆర్ - 50 లక్షలు
రామ్ - 25 లక్షలు
రవితేజ - 10 లక్షలు
విజయ్ దేవర కొండ - 10 లక్షలు
త్రివిక్రమ్ - 10 లక్షలు
నిర్మాత ఎస్. రాధాకష్ణ - 10 లక్షలు
మైత్రి మూవీ మేకర్స్- 10 లక్షలు
హరీష్ శంకర్ - 5 లక్షలు
బండ్ల గణేష్ - 5 లక్షలు
దర్శకుడు త్రినాథ్ వెలిసిల - 50 వేలు