Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా 'టెంప్ట్ రాజ'. మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రాంకి (వీర్నాల రామకష్ణ) మాట్లాడుతూ,'యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్గా యూత్‌ని బాగా అలరిస్తుంది. ఇందులో పోసాని కష్ణ మురళి పాత్ర సరికొత్తగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తూ, నిర్మించిన ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను' అని చెప్పారు.
రాంకి (వీర్నాల రామకష్ణ), దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని కష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్, డిఓపి: రాజు, ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి, మ్యూజిక్, సాంగ్స్: హరి గౌర, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్, స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకష్ణ), డైలాగ్స్: రాంకి, జి.రవి, విజరు.