Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ తొలిసారి ప్రేక్షకుల్ని భయపెట్టడానికి రెడీ అవుతోంది. తన కెరీర్లో మొదటిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన 'లైవ్ టెలికాస్ట్' ఫస్ట్‌లుక్‌లో కాజల్ విశ్వరూపం చూసి అభిమానులు షాకవుతున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ అతి త్వరలో డిస్నీం హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.