Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కలర్‌ఫొటో'. ఇటీవల 'ఆహా' ఓటీటీలో విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- ఈ సినిమా రిలీజయ్యాక హీరో నాని కాల్ చేసి, సినిమా బాగా తీసారని అభినందించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఈ సినిమాని రెండుసార్లు చూశానని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రవితేజ, డైరెక్టర్ మారుతి, రాజమౌళిగారు.. ఇలా ఇండిస్టీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కొంతమంది హీరోలు ఫోన్ చేసి త్వరలోనే కలుద్దామని చెప్పారు. ఇవన్ని నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి.
- అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడ్డం చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టోరీ అనుకుని, దాన్ని డెవలప్ చేసే క్రమంలో నేను క్లైమాక్స్‌పైనే ఎక్కువ దష్టి పెట్టా. క్లైమాక్స్ బాగుంటే సినిమాని ఆడియెన్స్ ఆదిరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకే క్లైమాక్స్ కొత్తగా ఉండేలా రెండు విధాలుగా తెరకెక్కించాను. ఫిక్షన్ క్లైమాక్స్, నాన్ ఫిక్షన్ క్లైమాక్స్ అంటూ రెండు ఎండింగ్స్ మా సినిమాలో ఉండేలా చూసుకున్నా, వీటికి అడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
- ఈ సినిమా కోసం కాల భైరవ చేసిన మ్యూజిక్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ మా సినిమాకి పెద్ద ఎస్సెట్. అలానే మా ఇద్దరి జర్నీ కూడా ఎప్పటి నుంచో సాగుతోంది. అందుకే ఇద్దరం చాలా కంఫర్ట్‌గా వర్క్ చేసుకోగలిగాం.
- ఈ సినిమా కథ ప్రకారం హీరో నల్లగా ఉండాలి. ఈ కారణంతో సుహాస్‌ని తీసుకుంటే, ఇదే నేపథ్యంలో ఎత్తులు, పల్లాలు చూసిన సునీల్ ఇద్దరికిద్దరు వారి పాత్రలకు సంపూర్ణమైన న్యాయం చేశారు. వారితో పాటే హీరోయిన్ చాందినీ కూడా అద్భుతంగా నటించింది.
- నేను స్ట్రగిలింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, నన్ను డైరెక్టర్ని చేయడానికి డబ్బులు పెట్టడమే కాకుండా తానే ఓ స్టోరీ రెడీ చేసి ఇచ్చారు సాయిరాజేశ్. మా ఇద్దరికి మరింత సపోర్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌లోకి బెన్నీగారు వచ్చి చేరారు. నా నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికి మరువలేను.
- నిర్మాత ఎస్కేఎన్తో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.
- మా 'కలర్ ఫొటో' సినిమా 'ఆహా' యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. హాయిగా ఇంట్లో అందరితో కలిసి చూడదగ్గ సినిమా. సినిమాని తప్పకుండా చూసి నన్ను, నా చిత్ర బృందాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా.