Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్య నటుడు షకలక్ శంకర్ లీడ్ రోల్లో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది'. నూతన దర్శకుడు కుమార్ కోట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ, నిర్వహణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' అనే క్యాచీ టైటిల్‌తో అటు ప్రేక్షకులు, ఇటు ఇండిస్టీ వర్గాల ఎటెన్షన్ తెచ్చుకున్న ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్‌తో కూడా అనూహ్య స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ని రిలీజ్ చేేశారు. స్టార్ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ ఈ టీజర్‌ని విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ముగిసిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల తెలిపారు. షకలక శంకర్ మార్క్ కామెడీతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలతో, అన్ని వర్గాలు ప్రేక్షకుల్ని అలరించే రీతిలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు కుమార్ కోట చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నెలాఖరులో ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రియజి, అర్జున్ కళ్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక, హీనా, రితిక చక్రవర్తి , సంజన చౌదరి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.