Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పవర్ ప్లే'. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి, టీమ్ అందరికీ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ, 'మా మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రానాకి దన్యవాదాలు. పోస్టర్లో రాజ్ తరుణ్ లుక్ ఎలా డిఫరెంట్‌గా ఉందో, సినిమా కూడా అలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్ తరుణ్ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్లో భిన్నమైన థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. 'విజయ్ కుమార్‌తో 'ఒరేయ్ బుజ్జిగా..' లాంటి మంచి ఎంటర్టైనర్ చేశాను. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఒక సరికొత్త జోనర్లో డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ చేస్తున్నాను. నాకు ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. ఆడియన్స్‌కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు' అని కథానాయకుడు రాజ్‌తరుణ్ తెలిపారు. నిర్మాతలు మహిదర్, దేవేష్ మాట్లాడుతూ, ''ఒరేయ్ బుజ్జిగా..'లాంటి సూపర్‌హిట్ తర్వాత రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అందరి అంచనాలను అందుకునేలా విజయ్ కుమార్ చాలా బాగా తీశారు. థ్రిల్లర్ జోనర్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలపర్తి అనంత్ సాయి మాట్లాడుతూ,'చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అని చెప్పారు.
రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: నంధ్యాల రవి, సినిమాటోగ్రఫి: ఐ. ఆండ్రూ, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి, ఆర్ట్: శివ, ఫైట్స్: 'రియల్' సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పలపర్తి అనంత్ సాయి, సమర్పణ: శ్రీమతి పద్మ, నిర్మాతలు: మహిదర్, దేవేష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా.