Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిషిక్త్, సమ్మోహన జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'రోబరి'. సుదర్శన్ మూవీ మేకర్స్ పతాకంపై యస్.యన్.నాయుడు, యస్.ఏ.నరసమ్మ సమర్పణలో యస్.శ్రీనివాస్ దర్శక, నిర్మాతగా, యస్.సుధీర్ సహనిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని ఆయన స్వగహంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'ట్రైలర్ బాగుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే వినూత్న కాన్సెప్ట్‌తో ఉన్న ఈ చిత్రం విజయం సాధించి దర్శక, నిర్మాతలకు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఏ.పి.ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ, 'ఎన్నో సంవత్సరాలుగా సినిమానే నమ్ముకుని ఉన్న వ్యక్తి శ్రీనివాస్. ఈ సినిమా విజయంతో అతని చిరకాల కోరిక నెరవేరి, మరెన్నో చిత్రాలను నిర్మించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. దర్శక, నిర్మాత యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ, 'నా అభిమాన హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా నా సినిమా ట్రైలర్ లాంచ్ జరగడం నా అదష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీమిత్ర చౌదరి, మోహన్ గౌడ్‌కి నేను ఋణపడి ఉంటాను. శ్రీకాంత్ గారిది లక్కీ హ్యాండ్. ఆ లక్ మాకు కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
'ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది. దర్శక, నిర్మాత శ్రీనివాస్ ఎక్కడా రాజీపడకుండా మా దగ్గర్నుంచి అవుట్‌ఫుట్ తీసుకున్నారు' అని కథానాయకుడు అభిషిక్త్ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర చౌదరి, నారాయణరావు, పెరుగు వెంకటేష్, మిత్తాని ఈశ్వర్, రాయిపాటి నాగేశ్వర్, దొరబాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.