Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'నారప్ప'. విభిన్న తరహా పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ చిత్రంలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. వెంకటేష్, ప్రియమణి ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా కుటుంబంతో కలిసి కొత్తగా కనిపిస్తున్నారు. పోస్టర్లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు. ఇప్పటివరకు విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజరు, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు శంకర్ డొంకాడ, కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.