Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాధాకష్ణ సినిమాలోని 'నిర్మల్ బొమ్మ ఎంత బాగున్నవమ్మా..' చాలా మంచి మెలోడీ సాంగ్. వండర్‌ఫుల్‌గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ చాలా మంచి సంగీతాన్ని అందించారు. మా తెలంగాణలోని బ్యూటీని ఈ పాటలోని సంగీతంతో శ్రీలేఖ చూపించారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు కథానాయిక విజయశాంతి అన్నారు. 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'రాధాకష్ణ'. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంతెన నరసింహరాజు (చిలుకూరు) సమర్పణలో, హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'నిర్మలబొమ్మ ఎంత బాగున్నవమ్మా..' పాటను విజయశాంతి విడుదల చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ,'మా సినిమాకి ఆత్మలాంటి పాట 'నిర్మల బొమ్మ ఎంత బాగున్నవమ్మా..'ను విజయశాంతి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మల్ బొమ్మల విశిష్టతను, ఆ బొమ్మలను ఎలా చేస్తారు.. వాటి గొప్పతనాన్ని చాటి చెప్పే సాంగ్ ఇది. సుద్దాల అశోక్ తేజగారు రాసిన ఈ పాటను మంగ్లీతో పాడించాం. అన్ని బాగా కుదిరాయి' అని తెలిపారు. 'కనుమరుగైపొతున్న మన చేతివత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే సామాజిక దక్పథంతో నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమాని నిర్మించాం. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ మా నిర్మల్ బొమ్మల మీద చక్కని సాహిత్యం అందించారు. అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వర్క్ చేసిన ఎం.ఎం.శ్రీలేఖ సాహిత్యానికి తగ్గట్టుగా ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించడం జరిగింది. అలాగే మంగ్లీ అందంగా ఆలపించారు. వారందరి దన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 'నిర్మల బొమ్మ సాంగ్' కూడా తప్పకుండా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం' అని చిత్ర నిర్మాత పుప్పాల సాగరిక కష్ణకుమార్ అన్నారు.