Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'చెక్'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న గ్రాండ్ విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , 'జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడిన ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కి చక్కటి స్పందన లభించింది. ఇందులో కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి' అని చెప్పారు. పోసాని కష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్ : వివేక్ అన్నామలై, ఎడిటింగ్ :అనల్ అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి.ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.