Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలను విభిన్న తరహాలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేయడం విశేషం. సినిమా స్టార్లతో కాకుండా ఈ సినిమాలోని పాటలను కోవిడ్ హీరోలు రిలీజ్ చేయనున్నారనే విషయాన్ని జగపతిబాబు ఎనౌన్స్ చేయడం మరో విశేషం. అందరినీ క్షేమంగా ఉంచడానికి తమ జీవితాల్ని పణంగా పెట్టి, కోవిడ్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సెల్యూట్ చేయాలనే సదుద్దేశంతో వారిని ఆడియో వేడుకకు ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు.
'దేశమంతా లాక్డౌన్లో ఉన్న కాలంలో, అందరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న సమయంలో, ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తూ వచ్చిన మెడికల్, పోలీసు, మునిసిపల్, మీడియా సిబ్బంది కృషి అభినందనీయం. వారి అసామాన్య సేవలకు గుర్తింపుగా ఒక్కో విభాగానికి చెందిన రియల్ హీరో చేతుల మీదుగా ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేయిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సందేశంలో జగపతిబాబు చెప్పారు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ, తాను పని చేసిన అత్యంత విలక్షణ చిత్రాల్లో ఈ సినిమా ఒకటని తెలిపారు. ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ మూవీ అని, ఇందులో తాను చేసిన ఫాదర్ క్యారెక్టర్ చాలా తృప్తినిచ్చిందని చెప్పారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.