Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై నాగ్అశ్విన్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'ఇప్పటికే ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్‌గా విడుదల చేసిన పోస్టర్స్‌కి, జోగిపేట శ్రీకాంత్‌గా మొదటి జాతి రత్నం నవీన్ పొలిశెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ 'చిట్టి..' లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా, అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు. మురళిశర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.