Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్.యస్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '70 ఎమ్.ఎమ్'. రాజశేఖర్, ఖాసీం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అక్షత శ్రీనివాస్ సోమవారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. 'నేను ఈ సినిమాలో జేడీ. చక్రవర్తికి భార్యగా నటించాను. సినిమా చిత్రీకరణ సమయంలో జేడీ దగ్గర చాలా నేర్చుకున్నాను. సాయి కార్తీక్ సంగీతం, అంజి సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణలు. ఆర్.పి., చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ సూపర్‌గా ఉంటాయి. నిర్మాతలు చాలా చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన జేడీ చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. నాకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకునే చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. యాక్షన్‌తోపాటు నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ టైటిల్లోనే సినిమా కథ ఉంది. దానికి పూర్తి అర్థం సినిమా చూశాకే తెలుస్తుంది. ఈ సినిమాతోపాటు ఆదాశర్మ నటిస్తున్న కొశ్యన్ మార్క్ (?) సినిమాలో మంచి పాత్ర చేశాను. అలాగే 'జార్జిరెడ్డి' హీరో సందీప్ మాధవ్‌తో 'గంధర్వ' సినిమాలో నటిస్తున్నాను. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయ్యింది' అని అక్ష్షత శ్రీనివాస్ తెలిపింది.