Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.ఎస్ ప్రొడక్షన్ (బెంగుళూరు) పతాకంపై ధ్రువ సర్జా హీరోగా రచితారాం, హరి ప్రియ, సాయి కుమార్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'భర్జరి' చేతన్ దర్శకత్వంలో ఆర్.శ్రీనివాస్ నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో పద్మావతి పిక్చర్స్ (గుంటూరు) వి.శివ సుబ్బారావు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వి.శివ సుబ్బారావు మాట్లాడుతూ,'తెలుగులో మొదటి చిత్రం 'పొగరు'తో ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో ధ్రువ సర్జాకి కన్నడలో నటించిన 'భర్జరి' చిత్రం ఎంతో పేరు తీసుకొచ్చింది. తెలుగులో విడుదల చేయడానికి ఎంతో మంది పోటీ పడినప్పటికీ మంచి ఫ్యాన్సీ రేటుకు మేం ఈ చిత్రాన్ని తీసుకోవడం హ్యాపీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం. వినూత్న రీతిలో ప్రమోషన్ చేస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. కన్నడలో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.