Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. మే 13న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా బుధవారం ఈ చిత్రంలోని 'లాహే లాహే..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన టెంపుల్ సెట్లో చిత్రీకరించారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌తో పాటు నటి సంగీత కూడా ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను హారిక నారాయణ్, సాహితీ ఆలపించారు. ఫోక్ సాంగ్.. సెమీ క్లాసిక్ ఫార్మేట్లో ఉన్నా ఈ పాట అందరినీ అలరిస్తూ సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.