Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజిత్ రాచకొండ, సిద్ధార్థ, వంశీధర్, జై సంపత్ హీరోలుగా, నేహా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'నలుగురితో నారాయణ'. (దేవుడే దిక్కు అనేది ట్యాగ్ లైన్). జి.ఎల్.బి శ్రీనివాస్ సమర్పణలో అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల రవీందర్రావు సారధ్యంలో ఎండి అస్లాం నిర్మిస్తున్న చిత్రమిది. రామ్.ఎస్.కుమార్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్‌ను ఫిలింఛాంబర్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట రవీందర్ రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు మంచి యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయనిపించింది. ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధిస్తుంది' అని చెప్పారు. నిర్మాత ఎండి అస్లాం మాట్లాడుతూ,'గతంలో ఇదే దర్శకుడుతో 'అంతా విచిత్రం' తీశాను. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా బాగా రావడంతో ఇదే దర్శకుడితో '24 గంటలు' అనే కథతో మూడవ చిత్రానికి అవకాశం కల్పించాం' అని చెప్పారు. 'మా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు హ్యాపీగా ఎంజారు చేస్తాడు' అని చిత్ర దర్శకుడు రామ్.ఎస్.కుమార్ చెప్పారు.