Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిజేమ్స్, రేణుప్రియ జంటగా రూపొందుతున్న చిత్రం 'మద్రాస్ బస్టాండ్'. లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్, శ్రీ నందనం ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో మొచర్ల శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రమిది. జనార్ధన్ శివలంకి దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మోచర్ల శ్రీను మాట్లాడుతూ, 'దర్శకుడు జనార్ధన్ మాకు కథ ఏదైతే చెప్పారో, అదే విధంగా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కచ్చితంగా మా బ్యానర్‌కి మంచి పేరు తెస్తుంది. మా మొదటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని తెలిపారు. దర్శకుడు జనార్ధన్ శివలంకి మాట్లాడుతూ,' ఇదొక విభిన్న ప్రేమ కథా చిత్రం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ఫ్యామిలీ సెంటి మెంట్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియోని రిలీజ్ చేస్తాం' అని చెప్పారు. మురళి కృష్ణారెడ్డి, రాజ్‌కుమార్, శాంతి కుమార్ (జబర్దస్త్), బాబు పోకల, నెల్లూరు శ్రీను, జయచంద్ర, ఆయేషా తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నాగేంద్ర బన్నీ, మ్యూజిక్ డైరెక్టర్ : రాంప్రసాద్ రేవూరి, ఎడిటింగ్ : బాబు పోకల, లిరిక్స్ :మహేశ్వరావు నాయుడు, రాధయ్య మాముడూరు, కో ప్రొడ్యూసర్స్ :భాస్కర భారతి దేవి, రఘు మన్నేపల్లి, మోచర్ల శ్రీను.