Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం పై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనికాంత్‌ని ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తోంది. బి.నాగిరెడ్డి, ఎల్వీప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, గోపాలకృష్ణన్, డి.రామానాయుడు, బాలచందర్, కె.విశ్వనాథ్ తదితరులు ఇప్పటికే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తన కెరీర్లో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా రజనీ ఓ భావోద్వేగ భరిత ట్వీట్ చేశారు. 'సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రకాశ్ జావడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హదయ పూర్వక కతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్ బహదూర్, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే ఈ రజనీకాంత్‌ను సష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను' అని రజనీ పేర్కొన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని సొంతం చేసుకున్న రజనీకి అన్ని చిత్ర రంగాల ప్రముఖులు అభినందనలు తెలిపారు.