Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ప్రతిబింబాలు'. అనుకోని కారణాల వల్ల 39 ఏండ్లగా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయిన ఈ సినిమా అతి త్వరలో రాబోతోంది. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో, హీరోయిన్లుగా విష్ణు ప్రియా కంబైన్స్ అధినేత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి ప్రారంభించారు. ఈ చిత్రంలో కొంత భాగాన్ని అలనాటి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ప్రకాష్ రావు, మరికొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా గురించి నిర్మాత రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ,'ఆనాడు మేము కొత్తదనంగా ఫీలై ఈ చిత్ర కథాంశాన్ని ఎన్నుకొన్నామో, ఈనాటికీ అటువంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. మా సినిమా చూసి ప్రతి ఒక్కరు ఫ్రెష్ నెస్ ఫీలవుతారు. యంగ్ లుక్లో నాగేశ్వరరావుగారి నటన ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఆయనతో జయసుధ పోటీపడి నటించారు. అక్కినేని ఫ్యాన్సే కాకుండా అందరినీ అలరించే ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.