Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలోని 'ఏ జిందగీ పాట..' అంటూ సాగే పాటను ఈనెల 5న విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట టైటిల్‌కి తగ్గట్లుగా 'ఏ జిందగీ..' అంటూ సైకిల్ మీద అఖిల్, పూజా హెగ్డే వెళ్తున్న స్టిల్ అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాని జూన్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అఖిల్, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేశారు' అని నిర్మాతలు చెప్పారు. ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభరు, అమిత్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.