Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ఆర్ఆర్' టీమ్ నుంచి మరో స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. శుక్రవారం అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. చుట్టూ వందలాది తుపాకులతో తనని కాల్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ ఎంతో నిర్భయంగా వాళ్ళని సవాల్ చేస్తున్నట్టు ఉన్న అజయ్ తీరు అందరినీ అలరిస్తోంది. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. అలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, హాలీవుడ్ తారలు ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవెన్ సన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.