Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా జరుగుతోంది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఉదయం ఏడు గంటలకే 'హరిహర వీరమల్లు' సెట్స్‌కు చేరుకున్న పవన్‌కల్యాణ్ యాక్షన్ డైరెక్టర్ సారథ్యంలో స్టంట్స్ ప్రాక్టీస్ చేశారు. ఓ పక్క రాజకీయాలు, మరో పక్క పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వత్తిపట్ల పవన్‌కి ఉన్న అంకితభావానికి అద్దం పట్టేలా ఈ ఫొటోలు ఉండటం విశేషం. 'వత్తిపట్ల పవన్‌కల్యాణ్‌కి ఉన్న అంకితభావమిది. ఉదయం ఏడు గంటల సమయంలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు ముందు 'మాస్టర్' యాక్షన్ డైరెక్టర్ శ్యామ్కౌశల్తో కలిసి పోరాట సన్నివేశాలకు సిద్ధమవుతోన్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్' అని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.