Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జంట ఆస్కార్లను అందుకున్న ఎ.ఆర్.రెహ్మాన్ సినిమా ప్రొడక్షన్ అనేది పక్కదారి పట్టడంలాంటిదని అనుకున్నారట. కానీ, ఓ పాటను ఎలా కంపోజ్ చేస్తారో, సినిమా మేకింగ్ కూడా అంతే శ్రద్ధగా చేయాల్సిన పని అని, అచ్చం అలాంటిదేనని ఆయనకు దర్శకుడు మణిరత్నం చెప్పారట. ఆ ప్రోత్సాహంతోనే రెహ్మాన్ తన '99 సాంగ్స్'కి స్క్రిప్ట్ సమకూర్చుకున్నారట. దీని గురించి రెహ్మాన్ మాట్లాడుతూ, 'మామూలుగా పాటలో ఓ ఇంట్రడక్షన్ ఉంటుంది. పాటకో థీమ్ ఉంటుంది. ట్యూన్ చేస్తాం. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మిక్సింగ్ చేస్తాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ జరిగి అందమైన పాటగా రూపాంతరం చెందుతుంది. దానికి సాహిత్యం సమకూరుస్తాం. పాట పుట్టుక ఇలా ఉంటుందన్నమాట. ప్రజల మనసులోని భావాలను కథ ఎంత వరకు ప్రతిబింబించిందనే దాన్ని బట్టే సక్సెస్ ఉంటుంది. సౌండ్, విజువల్స్ వారిలో మంచి అనుభూతిని మిగులుస్తాయి' అని చెప్పారు. ఇహాన్ భట్, ఎడిల్సి వర్గస్, మ్యూజిషియన్, డైరక్టర్ విశ్వేష్ కష్ణమూర్తితో కలిసి ఆయన నిర్మాతగా '99 సాంగ్స్'ని నిర్మిస్తున్నారు. '99 సాంగ్స్' ని హిందీ, తమిళం, తెలుగులో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పిస్తోంది. ఎ.ఆర్.రెహ్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వైయం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఐడియల్ ఎంటర్ టైన్మెంట్ సహ నిర్మాణ సంస్థ.