Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భీమవరం టాకీస్ పతాకంపై నరసింహనంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జాతీయ రహదారి'. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రమిది. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా వి.వి వినాయక్ మాట్లాడుతూ,'నరసింహ నంది అవార్డ్స్ సినిమాలు తీయటంలో దిట్ట. మా రామ సత్యనారాయణ గారికి ఈ సినిమాతో అవార్డ్స్ రావాలనే కోరిక తీరుతుంది. ట్రైలర్ బాగా వచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని చెప్పారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'నేను చేసే ప్రతి సినిమా వెనుక మా వినాయక్ గారి సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు మంచి సపోర్ట్ చేశారు. ఈ ట్రైలర్‌ని వినాయక్ గారు చేతులు మీదుగా రిలీజ్ చేయాలి అని మా దర్శకుడి కోరిక. మా దర్శకుడి కోరిక తీర్చినందుకు వినాయక్‌కి థ్యాంక్స్. ఇప్పటికే ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కి నామినేట్ అంది. 68వ జాతీయ అవార్డ్స్‌కి కూడా అప్లై. చేశాం. ఇది మా విజయానికి పునాది అన్నారు. నరసింహ నందికి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత ఇచ్చి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా గొప్ప విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా వస్తాయనే గట్టి నమ్మకం ఉంది' అని అన్నారు.
'నా మొదటి చిత్రం బెల్లంకొండ సురేష్‌గారు విడుదల చేసినప్పుడు వినాయక్ గారి సపోర్ట్ ఎంతో ఉంది. నేను వినాయక్ అభిమానిని. ఆయన మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఎప్పటికైనా ఆయన నిర్మాతగా ఓ సినిమా తీయాలి. దానికి నేనే దర్శకుడుగా ఉండాలి అనేది నా కోరిక. ఆయన మాస్ డైరెక్టర్ అయినప్పటికీ మంచి కళాత్మక గుణం ఉంది' అని దర్శకుడు నరసింహ నంది తెలిపారు.