Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున హీరోగా అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ఫుల్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం సక్సెస్ కేక్‌ని కట్ చేసి సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ, 'మా సినిమాని మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని చెప్పారు. మరో నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, 'బాక్సాఫీస్ కోణంలో ఆలోచించి మేం ఈ సక్సెస్‌మీట్ పెట్టలేదు. సినిమా నిన్ననే రిలీజైంది. నాగ్‌సార్ ముందు నుండి ఒక్కటే చెప్పారు. ఈ కథని మనం హానెస్ట్‌గా చెబుతేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని. కాబట్టి మేం ఎలాంటి సినిమా తీయాలని ఆశించామో అలాంటి సినిమా తీశాం. మా ప్రయత్నం సఫలమైనందుకు ఈ మీట్ ఏర్పాటు చేశాం'అని తెలిపారు. దర్శకుడు అహిషోర్ మాట్లాడుతూ,'సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని చెప్పారు. 'నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు. కలెక్షన్స్ బాగున్నాయని నిర్మాత నిరంజన్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్' అని నాగార్జున అన్నారు.